తెలంగాణలో బీజేపీతో పొత్తు ఉండదు,మద్దతు మాత్రం ఉంటుంది-పవన్

వారాహికి పూజ..
హైదరాబాద్: త్వరలో తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన పార్టీ సిద్ధంగా వున్నదని జనసేనా పవన్ కల్యాణ్ ప్రకటించారు.. మంగళవారం పవన్ కల్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టులోని అంజనేయస్వామిని దర్శించుకుని వారాహికి వాహన పూజ చేయించారు..అనంతరం స్థానిక తెలంగాణ నేతలతో పవన్ సమావేశమయ్యారు.. ఈ సందర్భంలో అయన మాట్లాడుతూ ‘‘బీజేపీకి, జనసేనకు ఎప్పుడూ దోస్తీనే,,రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు..GHMC ఎన్నికల్లాగా ఈ సారి వదిలేయమని,,25-40 అసెంబ్లీ స్థానాల్లో,,7-14 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు..త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తా…తెలంగాణ సమస్యలపై లోతైన అధ్యయనం చేశాకే తుది నిర్ణయం…తెలంగాణ ప్రజలకు సందేశాలు ఇచ్చే స్థాయిలో నేను లేను…వారి పోరాటాలు చూసి నేర్చుకున్నా…యువత బలిదానాల మధ్య తెలంగాణ ఏర్పడింది…ఒక రాజకీయ పార్టీ,రాత్రికిరాత్రే బలం పుంజుకోలేదు…చాకలి ఐలమ్మ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు..మన పార్టీ భావజాలానికి దగ్గరగా ఉంటే పొత్తులు స్వీకరిస్తాం…కార్యకర్తలు వీధి పోరాటాలకు సిద్ధం కావాలన్నారు..తెలంగాణ,,ఆంధ్ర ప్రదేశ్ సమస్యలు వేరు వేరు అని,, రెండింటినీ ఒకటిగా పోల్చి చూడలేమని అన్నారు..ఏపీతో పోలిస్తే తెలంగాణలో అభివృద్ధి జరిగింది…రాజకీయ కారణాలతో ఏపీలో ‘వారాహి’కి అనుమతి ఇవ్వలేదు…ఏపీలో కులాల గీతలు ఉంటాయి…ఎన్నికలప్పుడే పొత్తులపై ఆలోచిస్తాం…కొత్త పొత్తులు కుదిరితే కొత్తగా కలిసి వెళ్తాం…పొత్తులు కుదరకపోయినా ఒంటరిగానే వెళ్తామంటూ స్పష్టమైన వైఖరిని వ్యక్తం చేశారు…తెలంగాణలో బీజేపీతో పొత్తు ఉండదు… అయితే నా మద్దతు మాత్రం ఉంటుంది’’ అని పవన్ వ్యాఖ్యానించారు.