నెల్లూరు: జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి దళితులు దుర్బలమైన పరిస్థితిలో ఉన్నారని,దళితుల్ని రక్షించాల్సింది పోయి వారిపై దాడులు, హత్యలు అత్యాచారాలు అధికం చేశారని నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆరోపించారు.నగరంలోని అయన నివాసంలో మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల కావలిలోని దళితులపై వరస ఘటనలు జరిగాయని అన్నారు..కరుణాకర్ అనే వ్యక్తిని వైసీపి నాయకులు మానసిక క్షోభకు గురి చేసి అతని మరణానికి కారణమయ్యారని చెప్పారు..కరుణాకర్ మరణానికి కారణమైన వారిపై పోలీసులు కేసు నమోదు చేయలేదని, SC కమిషన్ దృష్టికి జరిగిన సంఘటన టీడీపీ తీసుకుని వెళ్లి వారికి న్యాయం జరిగేల చర్యలు తీసుకుందన్నారు..పోలీసుల వేధింపులు తాళలేక పైడి.హర్ష ఆత్మహత్యాయత్నం చేశాడని,,అలాగే పెట్రోలు బంకులో అప్పు ఇవ్వలేదని తేజా అనే యువకుడిని, వైసీపీ నాయకులు చంపబోతే 307 నమోదు చేయకుండా, కేవలం అట్రాసిటీ కేసు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారని ద్వజమెత్తారు.దళితులకు జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించేందుకు టీడీపీ ఛలో కావలికి పిలుపునిస్తే, నిన్న మధ్యాహ్నం నుంచే పోలీసులు నోటీసులు జారీ చేసి, అర్ధరాత్రి ఇళ్ల వద్దకు వచ్చే హౌస్ అరెస్ట్ లు చేశారని మండిపడ్డారు..జీవో నెంబర్ 1 పేరిట దిక్కుమాలిన జీవో తీసుకువచ్చి ప్రశ్నించే గొంతు నొక్కేస్తున్నారని, రాజ్యాంగం ఇచ్చిన హక్కును కాలరాసెందుకు పోలీసులు ఏం హక్కు ఉందని ప్రశ్నించారు..దళితులపై దాడులు,హత్యలు,అత్యాచారాలు జరుగుతుంటే సమాజంలో చూస్తూ కూర్చోవాలా, ప్రశ్నించే గొంతులను నొక్కి వేయడంను తెలుగుదేశం పార్టీ దీనిని తీవ్రంగా ఖండిస్తుందన్నారు..