2 కిలోమీటర్ల పొడవైన రైల్వే ట్రాక్‌ను మాయం చేసిన దొంగలు

అమరావతి: ప్రభుత్వ ఆస్తులైన,,ప్రవేట్ ఆస్తులైన మనకు ఒకటే,,వాడకుండా ప్రక్కన పెడితే,,మాయం చేయడంలో ముందు వుంటామంటూన్నారు..గత సంవత్సరం మొబైల్ టవర్, రైల్ ఇంజన్‌ను ఎత్తుకుపోయిన దొంగలు ఈసారి ఏకంగా రైల్వే ట్రాక్‌నే ఎత్తుకుపోయారు..బీహార్‌లోరి సమస్టిపూర్ జిల్లాలో సుమారు 2 కిలోమీటర్ల పొడవైన రైల్వే ట్రాక్‌ను దొంగలు మాయం చేశారు..దీంతో బిత్తరపోవడం పోలీసుల వంతయింది..పోలీసులు తెలిపిన వివరాల ఇలా వున్నాయి.. పాండైల్ రైల్వే స్టేషన్ నుంచి లోహత్ షుగర్ ఫ్యాక్టరీకి అనుసంధానంగా ఈ రెండు కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌ను ఉపయోగిస్తున్నారు..గత కొన్ని సంవత్సరాలుగా షుగర్ మిల్లు పనిచేయకపోవడంతో ఈ ట్రాక్ వినియోగంలో లేదు..ఈ విషయంను పసికట్టిన దొంగలు రైల్వే ట్రాక్‌ను వాయిదాల పద్దతిపై మాయం చేసి,, దానిని స్క్రాప్ డీలర్లకు అమ్మేశారు.. ఈ నేరంలో రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ సిబ్బంది ప్రమేయం ఉన్నట్టు అనుమానిస్తున్న రైల్వే ఉన్నతాధికారులు ఇద్దరు ఆర్‌పీఎఫ్ ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ఎఫ్ఐఆర్‌ను ఆర్పీఎఫ్ నమోదు చేసింది. ఘటనపై పూర్తి దర్యాప్తు చేస్తున్నామని, నిందితులపై చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు పేర్కొన్నారు..