x
Close
NATIONAL

పాత కళ్లద్దాలతో చూడటం అలవాటుగా ఉన్న వారు అభివృద్దిని సహించరు-మెదీ

పాత కళ్లద్దాలతో చూడటం అలవాటుగా ఉన్న వారు అభివృద్దిని సహించరు-మెదీ
  • PublishedNovember 19, 2022

డోనీ పోలో ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభం..

అమరావతి: పాత కళ్లద్దాలతో చూడటం అలవాటుగా ఉన్న వారు అభివృద్దిని సహించరంటూ ప్రతిపక్షాలపై విమర్శలపై ప్రధాని మోదీ మండిపడ్డారు.శనివారం అరుణాచల్ ప్రదేశ్‌ లోని “డోనీ పోలో” (సూర్యుడు-చంద్రుడు) ఎయిర్‌పోర్ట్‌ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారంనాడు ప్రారంభించారు. హోలింగిలో నిర్మించిన ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుతో ఈశాన్య రాష్ట్రాల్లో దేశభద్రతతో పాటు టూరిజం రంగం వేగంగా అభివృద్ధి కానుంది. ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, విపక్షాలు గతంలో విమానాశ్రయ నిర్మాణంపై చేసిన ఆరోపణలకు పై విధంగా తీవ్రంగా స్పందించారు.ప్రతి విషయాన్ని ఎన్నికల కోణంలో చూసే వాళ్లు,దశాబ్దల నాటి వాళ్లు పాత కళ్లద్దాలు మార్చుకోవాలని ప్రధాని హితవు పలికారు.

2019 ఫిబ్రవరిలో ఎయిర్‌పోర్ట్ ‌కు శంకుస్థాపన చేశానని, 2019 మేలో ఎన్నికలు ఉండటంతో ప్రతిపక్షాలు,అభివృద్దిని అడ్డుకోవడమే ధ్యేయంగా పెట్టుకుని విమర్శలు చేసే వాళ్లు గగ్గోలు చేశారన్నారు.దేశంలో ఏ మూల అభివృద్ది జరుగుతున్న పాత కళ్లద్దాలతో చూడటం అలవాటు ఉన్న విమర్శకులు, కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే మోదీ ఇక్కడకు వచ్చారని, ఎప్పటికీ విమానాశ్రయ నిర్మాణం జరగదని విమర్శించిన విషయంను ప్రధాని గుర్తు చేశారు. ప్రతీ కార్యక్రమానికి రాజకీయ రంగు పులిమే అలవాటు ఉన్న వారికి ఇప్పుడు విమానాశ్రయం ప్రారంభం కావడం చెంపపెట్టు అని చెప్పారు. పాత కళ్లద్దాలు తొలగించాలని వారికి చెప్పదలచుకున్నానని అన్నారు. రెట్టించిన ఉత్సాహంతో దేశం ప్రగతి పథం వైపు దూసుకెళ్తోందని, ఇప్పటికైనా ప్రతి విషయానికి రాజకీయ రంగు పులమడం మానుకోవాలని విమర్శకులకు హితవు పలికారు.690 ఎకరాల విస్తీర్ణంలో రూ.640 కోట్లతో ఈ విమానాశ్రయాన్ని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసింది. గంట‌కు 200 మంది ప్రయాణికులకు సేవాలు అందించే 8 చెక్ ఇన్ కౌంట‌ర్లు నిర్మించారు.2300 మీట‌ర్ల ర‌న్‌వే ఉండే విధంగా నిర్మించడంతో, బోయింగ్ 747 విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌కు అనుకూలంగా వుంటుంది.

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.