పేదలను దోచుకునే వాళ్లను వదిలిపెట్టేది లేదు-ప్రధాని మోదీ

హైదరాబాద్: పేదలను దోచుకునే వాళ్లను వదిలిపెట్టేది లేదని, పేదల ఎదుగుదలకు అవినీతే అడ్డుగా వున్నదని,క్కడ అన్యాయం జరిగితే అక్కడ బీజేపీ మరింత బలపడుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.శనివారం ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో పలు అభివృద్ది పనులు ప్రారంభించిన అనంతరం హైదరాబాద్ కు చేరుకున్న ప్రధాని బేగంపేట విమానశ్రయాంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కార్యకర్తలను ఉద్దేశించిన ప్రసంగిస్తూ…రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కేసులు పెడుతున్నా బీజేపీ కార్యకర్తలు భయపడడం లేదని, అణిచివేతకు వ్యతిరేకంగా రాష్ట్రంలో పోరాటం కొనసాగుతోందని చెప్పారు. పసుపు రైతులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వం పోయి బీజేపీ ప్రభుత్వం రావాలని ఆకాంక్షించారు. మునుగోడు ప్రజలు ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీకి ఒక భరోసా ఇచ్చారని అన్నారు. ఒక్క అసెంబ్లీ సీటు కోసం రాష్ట్ర ప్రభుత్వం మెత్తం మునుగోడులో మకాం వేసిందంటూ సెటైర్లు వేశారు. కమ్యూనిస్టులు అభివృద్ధి నిరోధకులు అని ఆరోపించారు. మరోవైపు మునుగోడు ఉప ఎన్నికలో రాష్ట్ర బీజేపీ పోరాటాన్ని ప్రశంసించారు. కొందరు తనను తిట్టడం కోసం డిక్షనరీలను వెతుకుంటున్నారని ప్రధాని మోడీ వ్యంగ్యంగా వ్యాఖ్యనించారు.తనను, బీజేపీని తిట్టినా భరిస్తాను కానీచ తెలంగాణ ప్రజలకు కష్టం వస్తే మాత్రం సహించనని చెప్పారు. 22 ఏళ్లుగా తాను తిట్లు తింటూనే ఉన్నానని, ఆ తిట్లే తనకు బలంగా మారుతున్నాయని చెప్పారు. కొంతమంది నిరాశవాదులు అదే పనిగా తిడుతుంటారని, రాష్ట్ర పాలకులకు తనను తిట్టడమే తెలుసన్నారు. తనను, బీజేపీని తిడితే రాష్ట్ర రైతులకు మేలు జరుగుతుందా..? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి,,, మంత్రులను కేబినెట్ లోకి తీసుకోవడం,,, వారిని మంత్రి వర్గం నుంచి తీసేవేయడం కూడా మూఢవిశ్వాసాలతో చేస్తున్నారని మోడీ ఎద్దేవా చేశారు.