AMARAVATHIPOLITICS

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి..

అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది..వారిపై అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది..అలాగే తిరుపతి ఎస్పీపై బదిలీ వేటు వేసింది., వీరితో పాటు పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లోని 12 మంది పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది..ఈ 12 మంది అధికారులపైనా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది..హింసాత్మక సంఘటనలపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది..IPC సెక్షన్ ప్రకారం FIR అప్‌‌డేట్ చేయాలని స్పష్టం చేసింది.

కలెక్టర్‌పై కూడా బదిలీ వేటు:– ఇదే సమయంలో పల్నాడుజిల్లా కలెక్టర్‌పై కూడా బదిలీ వేటు వేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.. పల్నాడు కలెక్టర్‌పై శాఖాపరమైన విచారణకు ఎన్నికల సంఘం ఆదేశించింది..ఒకటి,,రెండు రోజుల్లో సీఎస్‌పై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది..కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా కౌంటింగ్ ముగిసిన 15 రోజుల దాకా 25 CRPF బలగాల్నిఆంధ్రప్రదేశ్ పంపించాలని CEC ఆదేశించింది.

పెట్రోలు బాంబులు,వేట కత్తులు, గొడ్డళ్లు:-

ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పోలీసులు పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో బాంబులు కలకలం సృష్టించడంతో పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు..YSRCP నాయకులకు చెందిన రెండు ఇళ్లల్లో 55 పెట్రోలు బాంబులు,,వేట కత్తులు, గొడ్డళ్లు, పగలగొట్టిన బీరు సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు SP బిందు మాధవ్ తెలిపారు..వీటి వెనుక ఎవరు ఉన్నారు , బాంబులు ఎవరు తయారు చేసి విధ్వంసాలకు పాల్పడుతున్నారో వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్పీ తెలిపారు..ఇప్పటికే ఈ కేసులో గ్రామానికి చెందిన ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్​కి తరలిస్తామన్నారు..గొడవలకు బాధ్యులైన YSRCP,TDP నాయకులను అదుపులోకి తీసుకునే క్రమంలో తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో YSRCP గ్రామస్థాయి నాయకుల ఇళ్లలో బాంబులను గుర్తించారు..పోలింగ్‌ రోజున విధ్వంసం కోసం YSRCP నాయకులు ఈ బాంబుల్ని సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *