డిసెంబర్ నాటికి టిడ్కో గృహాల రిజిస్ట్రేషన్ లు పూర్తి-కమిషనర్ శ్రీమతి హరిత

నెల్లూరు: నవరత్నాలు పధకంలో రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ గృహాలు అందించే కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న టిడ్కో గృహాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను డిసెంబర్ నాటికి ముగించనున్నామని కమిషనర్ శ్రీమతి హరిత తెలిపారు. టిడ్కో గృహాలు, జగనన్న కాలనీల ప్రగతిపై హౌసింగ్ విభాగం అధికారులతో సమీక్షా సమావేశాన్ని కమిషనర్ ఛాంబర్ లో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గృహాలు మంజూరైన లబ్ధిదారులు కొంతమంది ప్రస్తుతానికి అందుబాటులో లేరని, వారిని సంప్రదించేందుకు కృషి చేయాలని సూచించారు. ఇతర ప్రాంతాల్లో తాత్కాలికంగా స్థిరపడిన గృహాల లబ్ధిదారులకు సమాచారం అందించి, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పాల్గొనేలా ప్రోత్సహించాలని సూచించారు. జగనన్న కాలనీలు, టిడ్కో గృహ సముదాయాల్లో త్వరితగతిన మౌళిక వసతులు కల్పించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ సమావేశంలో నగర పాలక సంస్థ సెక్రటరీ హేమావతి, టిడ్కో అధికారి రామ సుబ్బారావు, హౌసింగ్ విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.