AMARAVATHINATIONAL

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55 నిమిషాల పాటు సమావేశం కొనసాగింది..ఎన్నికల అనంతరం రాష్ట్రంలో చెలరేగిన హింసపై ఈసీకి వివరాలు అందజేశారు..హింసాత్మక ఘటనలు పునరావృతం కాకుండా,,ఇక ముందు ఎలాంటి గొడవలు జరగకుండా తగిన చర్యలు ఆదేశించినట్లు తెలియ వచ్చింది..స్ట్రాంగ్ రూమ్ ల వద్ద భద్రత పటిష్టం చేయాలని,, కౌంటింగ్ డే రోజున ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది..ఈసీతో భేటీ తరువాత సీఎస్,, డీజీపీలు ఢిల్లీ పర్యటన ముగించుకుని విజయవాడకు బయలుదేరారు..పోలింగ్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు, కారంచేడు, తాడిపత్రి, చంద్రగిరి, నర్సీపట్నం తదితర ప్రాంతాల్లో హింస చెలరేగింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *