నేడు ఆటల్ బీహారీ వాజ్ పాయ్ 98వ జయంతి

అటల్ జీ 98వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు..“భారతదేశానికి ఆయన చేసిన కృషి మరువలేనిది. ఆయన నాయకత్వం,,దృక్పథం లక్షలాది మంది ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాయి”..ప్రధాని నరేంద్ర మోదీ..
అటజీ గురుంచి మరి కొన్ని వ్యాఖ్యలు…
అమరావతి: అజాత శత్రువు అయిన ఆటల్ బీహారీ వాజ్ పాయ్ ఈ పేరు వింటేనే,,భారతదేశంలో పరుగులు తీసిన అభివృద్ది గుర్తుకు వస్తుంది..పార్టీ కన్నా దేశం మిన్న అని నమ్మి నిర్ణయాలు తీసుకున్న గొప్ప వ్యక్తి వాజ్ పేయి..వాజ్ పేయి ఏ పని చేసినా నిబద్ధతతో చేశారు..సుపరిపాలన అంటే ఏంటో వాజ్ పేయిను చూసి నేర్చుకోవాల్సిందేనని చెప్పారు. దేశంలో జాతీయ రహదారులు,,టెలిఫోన్స్ రావడానికి వాజ్ పేయి నాంది అని పేర్కొన్నారు..80 ఏళ్ల వయసులోనూ ఆర్థిక విధానాలపై సంస్కరణలు తీసుకొచ్చారు..ఓటర్ల జాబితా ప్రక్షాళన వాజ్ పేయి దూరదృష్టి వల్లే జరిగింది..91వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చిన ఘనత అటల్ జీ దే..పరిపాలనలో ఆయన మచ్చలేని వ్యక్తిగా మిగిలారని అన్నారు..