నేడు డిగ్రీలు పొందిన విద్యార్థులు దేశ సేవలో బాగస్వాములు కావాలి- రాష్ట్ర గవర్నర్

తిరుపతి: భారతదేశ ఉన్నత విద్యా వ్యవస్థ ప్రపంచంలో రెండవ అతి పెద్దదిగా ఉందని, అత్యాధునిక పరిజ్ఞానం, అత్యంత నైపుణ్యం కలిగిన మానవ శక్తిని అందించడం మన లక్ష్యం కావాలని శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయ కులపతి, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. శుక్రవారం శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయ 19,, 20వ స్నాతకోత్సవం మహిళా విశ్వవిద్యాలయంలో అత్యంత వైభవంగా నిర్వహించారు.రాష్ట్ర గవర్నర్ మాట్లాడుతూ మారుతున్న కాలానుగుణoగా ఉన్నత విద్యాసంస్థలు మెరుగైన విద్యా విజ్ఞానాన్ని అందించడానికి కృషి చేయాలని అన్నారు. పాఠ్య, పరిశోదనలు నిరంతరం జరగాలని అప్పుడే సమర్థవంతమైన ఉన్నత విద్య రాణించగలుగుతుందని అన్నారు. ఉమ్మడి బోధన, వర్చువల్ లెర్నింగ్, ఉపన్యాసాలు ద్వారా ప్రపంచవ్యాప్తంగా విద్యా సంస్థల మధ్య విజ్ఞానాన్ని పంచుకోవాలని అద్యాపకులు కొత్త పద్దతులలో భోదనలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ విశ్వవిద్యాలయం భారతీయ ఉన్నత విద్యా సంస్థలలో 24వ స్థానంలో నిలిచినందుకు 2021-22 ఫార్మసీ విభాగంలో 42వ ర్యాంకును సాదించినందుకు సంతోషంగా ఉందన్నారు.
వైస్ చాన్సలర్ డి.జమున మాట్లాడుతూ శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం దేశంలోనే ఆదర్శంగా నిలిచి విద్యా భోదన, పరిశోదనలు నిర్వహిస్తున్నామని ఎంతో మంది ప్రముఖులు ఈ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారని అన్నారు. వివిధ యూనివర్సిటీలు, విద్యా సంస్థలతో బాగస్వాములై విద్య, విజ్ఞానంలో పురోగతిలో ఉన్నామని 27 డిపార్ట్మెంట్ లు, 34 యు.జి., పి.జి. కోర్సులు నిర్వహిస్తున్నామని వివరించారు. Phd-71 మంది, M.Phil-3, 1902 మంది వివిధ కోర్సులలో పట్టాలు అందుకున్నరన్నారు. వీరిలో అత్యున్నత ప్రతిభ కనబరిచి మెడల్స్, బుక్ ప్రైజ్ లు, క్యాష్ ప్రైజ్ లు అందుకున్న 108 మందికి గవర్నర్ శుభాకాంక్షలు తెలియజేశారు.