NATIONAL

నేటి భారతదేశం ఇతరదేశాల సమస్యలకు పరిష్కరం చూపిస్తుంది-ప్రధాని మోదీ

అమరావతి: 2004లో విచ్చలవిడిగా మొదలైన అవినితి,,దశాబ్దం కాలం పాటు (2014)  వరకు సాగిందని,,కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉగ్రవాదం రాజ్యమేలిందని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఆరోపించారు..రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ  రాష్ట్రపతి ప్రసంగం దేశానికి ఆదర్శమన్నారు..ఆదివాసీ సమాజానికి గొప్ప గౌరవం దక్కిందన్నారు..నిన్న సభలో కొంత మంది సభ్యులు ఉత్సాహంగా వ్యాఖ్యలు చేశారన్నారని,,ఓ పెద్ద నాయకుడు రాష్ట్రపతిని విమర్శించారని,పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి వ్యంగ్యంగా వ్యాఖ్యనించారు..అలాంటి వ్యాఖ్యలు నేతల మనసులోని ద్వేషాన్ని బయటపెట్టాయన్నారు..ఒకప్పుడు భారతదేశం తన సమస్యల పరిష్కారానికి ఇతరులపై ఆధారపడే పరిస్థితి వుండేదని,, కానీ నేటి భారతదేశం ఇతరదేశాల సమస్యలకు పరిష్కరం చూపిస్తుందని రాష్ట్రపతి  చెప్పారని మోడీ గుర్తు చేశారు.. భారతదేశం ఈలాంటి క్షణం కోసమే  ఎంతో కాలం నుంచి  ఎదురుచూస్తుందని ప్రధాని అన్నారు..దేశంలో అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు తీసుకున్న చర్యలు ఫలితాలను ఇవ్వడం ప్రారంభించాయన్నారు..ఎన్నికలే జీవితం కాదని,,140 కోట్ల ప్రజల సంక్షేమమే తమకు ముఖ్యమన్నారు..కొవిడ్ ను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొందని  చెప్పారు..చాలా దేశాలను నిరుద్యోగం, ద్రవ్యోల్భణం వేదిస్తున్నాయని,,ఇలాంటి సమయంలోనూ మనం ప్రపంచలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగామన్నారు..నేడు G20 సదస్సును నిర్వహించే స్థాయికి ఎదిగామని,,ఇది కొందరికి కంటగింపు కావొచ్చు కానీ తనకైతే గర్వంగా ఉందని చెప్పారు.. 

ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం భారతదేశం వైపు చూస్తున్నాయన్న విషయం భారతదేశ యువతకు తెలుసన్నారు.. మొబైళ్ల తయారీలో దేశం రెండో స్థానంలో ఉందని,,డిజిటల్ ఇండియాను చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయాయని చెప్పారు..ఇంధన వినియోగంలో దేశం మూడో స్థానంలో ఉందన్నారు.. కామన్ వెల్త్ క్రీడల్లో మన ఆడపిల్లలు అద్భుతంగా రాణిస్తున్నారని కొనియాడారు..స్టార్టప్ లో మనం ప్రపంచంలో మూడో స్థానంలో ఉన్నామన్నారు.. ప్రతి రంగంలో భారత్ చరిత్ర సృష్టిస్తోందన్నారు..ఇవన్నీ చూసిన కొందరు నిరాశవాదులకు నిద్రపట్టడం లేదంటూ ఎద్దేవా చేశారు..2014 నుంచి ఇప్పటి వరకు  మేము ఏం చేశామో ప్రజలకు తెలుసని ప్రధాని మోడీ అన్నారు.   

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *