రేపు,ఎల్లుండి నెల్లూరుజిల్లాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు-వాతావరణ కేంద్రం

అమరావతి: బుధవారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం గురువారం(నేడు) పశ్చిమ మధ్య బంగాళాఖాతం,,దానిని ఆనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం మీదుగా సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతుందని నెల్లూరు వాతావరణ కేంద్రం అధికారి M.మురళీకృష్ణ తెలిపారు.. 7వ తేది నాటికి వాయువ్య,,దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందన్నారు..వీటి ప్రభావంతో రాబోవు మూడు రోజులకు వాతావరణం ఇలా వుంటుంది:-ఈ రోజు, రేపు, మరియు ఎల్లుండి నెల్లూరు జిల్లాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముందని పేర్కొన్నారు..