ఢిల్లీలో భారీగా వర్షాల కారణంగా స్తంభించిన ట్రాఫిక్-ఎల్లో అలెర్ట్ జారీ

అమరావతి: గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీగా వర్షాల కారణంగా ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లోని ప్రజలు తీవ్రఇబ్బందులు పడుతున్నారు..రోడ్లపై ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు గంటల సమయంలో రోడ్లపై నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పాడింది..రాజధాని ఢిల్లీలోని ఇఫ్కో చౌక్, శంకర్ చౌక్, రాజీవ్ చౌక్, గురుగ్రామ్–ఢిల్లీ ఎక్స్ ప్రెస్ హైవే సరిహద్దుల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.. ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశాలు ఉన్నయని వాతావరణ శాఖ వెల్లడించింది..నోయిడా, గురుగ్రామ్ ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది..ఇదే సమయంలో హర్యానాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్నాభారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి..రహదారులపై భారీగా వరద ప్రవహిస్తోంది.వర్షం నీటి కారణంగా ట్రాఫిక్ నియంత్రించడం కష్టంగా మారిందని గురుగ్రామ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ పేర్కొంది..ట్రాఫిక్ జామ్ తగ్గించేందుకు ఉద్యోగస్తులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని,,గురుగ్రావ్ లోని ఆఫీసులకు డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ సూచించింది..విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు.
#WATCH | Delhi: Traffic snarls in the national capital after incessant rain pic.twitter.com/uGiJJDgIUk
— ANI (@ANI) September 23, 2022