AMARAVATHIDISTRICTS

ఎన్నికల కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ-కలెక్టర్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు విధులు కేటాయించబడిన సిబ్బంది అందరూ శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని సమర్థవంతంగా కౌంటింగ్ ప్రక్రియను పూర్తిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం హరి నారాయణన్ సూచించారు. ఆదివారం నగరంలోని డీకేడబ్ల్యూ కళాశాలలో కౌంటింగ్ సిబ్బందికి నిర్వహిస్తున్న శిక్షణా తరగతులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  శిక్షణ కార్యక్రమాల్లో ఓట్ల లెక్కింపునకు సంబంధించిన అన్ని సందేహాలను ముందుగానే నివృత్తి చేసుకోవాలని  కౌంటింగ్ సిబ్బందికి సూచించారు. జూన్ 4వ తేదిన కనుపర్తిపాడులోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని, కౌంటింగ్ విధులను అప్రమత్తంగా నిర్వహించేందుకు సిబ్బంది సమాయత్తం కావాలన్నారు. కలెక్టర్ వెంట నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వికాస్ మర్మత్, నుడా విసి బాపిరెడ్డి, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ శర్మద, హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ ఉన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *