బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కాన్వాయ్ కోసం రైళ్లు నిలిపివేత

అమరావతి: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కాన్వాయ్ ఎలాంటి ఆవాంతరం లేకుండా ప్రయాణించడం కోసం రైళ్ళను నిలిపేయడాన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి..బిహార్ బీజేపీ నేత, కేంద్ర మంత్రి అశ్విని చౌబే స్పందిస్తూ,, ప్రయాణికులకు జరిగిన అసౌకర్యం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు..ఈ సంఘటనపై అత్యున్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని రైల్వే మంత్రిని కోరుతానని చెప్పారు..నితీశ్ కుమార్ సమాధాన్ పేరుతో రాజకీయ యాత్ర నిర్వహిస్తున్నారు..ప్రజల సమస్యలను తెలుసుకుని,,వాటిని పరిష్కరించడం కోసం ఈ యాత్ర చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నారు..బుధవారం బక్సర్‌లోని పోలీస్ లైన్స్ నుంచి అతిథి గృహానికి వెళ్లారు..ఆయన కాన్వాయ్ రైల్వే క్రాసింగ్‌ను దాటి,,నిరంతరాయంగా ప్రయాణించేందుకు వీలుగా, పాట్నా-బక్సర్ లోకల్ ట్రైన్,, కామాఖ్య ఎక్స్ ప్రెస్ రైళ్లను ఔటర్ సిగ్నల్ వద్ద నిలిపేశారు..హఠాత్తుగా రైళ్లను నిలిపి వేయడంతో ప్రయాణికులు అసహనానికి గురయ్యారు..కొందరు ప్రయాణికులు రైల్వే స్టేషన్‌కు వెళ్లి అధికారులను నిలదీశారు..