POLITICS

ఎన్నికల హామీలపై కాంగ్రెస్ పార్టీకి  కర్ణాటకలో కష్టాలు ప్రారంభం

అమరావతి: కాంగ్రెస్ పార్టీకి  కర్ణాటకలో కష్టాలు ప్రారంభంమౌవుతున్నాయి..ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజలు,ప్రతిపక్ష పార్టీలు పోరాటాలు ప్రారంభానికి సిద్దమౌవుతున్నాయి..నెలకు 200 యూనిట్ల కన్నా తక్కువ విద్యుత్తును వినియోగించేవారు జూన్ 1వ తేది నుంచి విద్యుత్తు బిల్లులను చెల్లించొద్దని బీజేపీ నేత, మైసూరు ఎంపీ ప్రతాప్ సింహ ప్రజలను కోరారు.. గురువారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, ఉచిత విద్యుత్తు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తాను మైసూరు-కొడగు ప్రాంతంలో ధర్నా చేస్తానని చెప్పారు..ఒక కుటుంబం నెలకు 200 యూనిట్ల కన్నా ఎక్కువ విద్యుత్తును వాడుకుంటే, అందులో 200 యూనిట్లను ఉచితంగా పరిగణించాలని, మిగిలిన యూనిట్లకు మాత్రమే బిల్లు వసూలు చేయాలని డిమాండ్ చేశారు.. నెలకు 200 యూనిట్ల కన్నా తక్కువ విద్యుత్తును ఉపయోగించేవారు జూన్ 1 నుంచి బిల్లులు చెల్లించవద్దని చెప్పారు..200 యూనిట్ల కన్నా తక్కువ విద్యుత్తు సిద్ధరామయ్యకు కూడా ఉచితమేనని ఆయన చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు..

ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా అందజేస్తామని కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే..224 స్థానాలున్న కర్ణాటక శాసన సభలో 135 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకున్నది..పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవిని,,డీకే శివ కుమార్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు..ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన అన్ని హామీలనూ త్వరలోనే అమలు చేస్తామని నూతన ప్రభుత్వం ప్రకటించింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *