హైదరాబాద్: నల్గొండ జిల్లా పరిధిలతోని మునుగోడు నియోజకవర్గంకు జరిగిన ఉపఎన్నికలో TRS అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి (95324) ఘన విజయం సాధించారు. BJP అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి (85123) ఓట్లు పోల్ అయ్యాయి. TRS అభ్యర్థి 10,040 ఓట్ల తేడాతో గెలుపొందారు. తొలి రౌండ్ నుంచి పోటా పోటీగా BJP,TRS ఓట్ల యుద్దం నడిచింది. దాదాపు 10 రౌండ్ల వరకు స్వల్ప మెజార్టీతో కనిపించిన TRS, 11వ రౌండ్ నుంచి స్పష్టమైన మెజార్టీ ప్రదర్శించింది. 2,3, 15వ రౌండ్లలో మాత్రమే BJP ముందంజలో నిలిచింది. మిగిలిన అన్ని రౌండ్లలో కారు దూసుకుపోయింది. బీజేపీ రెండో స్థానానికి పరిమితమైంది. మునుగోడు బై పోల్ లో కాంగ్రెస్ కు డిపాజిట్ గల్లంతైంది.ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి 21వేలకుపైగా ఓట్లను మాత్రమే సాధించారు.