నెల్లూరు: నెల్లూరు రూరల్ పరిధిలోని ఆశోక్ నగర్ ప్రాంతంలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఇంటిలోకి చొరబడి భార్యాభర్తలను దారుణంగా హతమార్చిన ఘటన చోటు చేసుకుంది..ఆదివారం డిస్పీ తెలిపిన వివరాలు ఇలా వున్నాయి..వాసిరెడ్డి.కృష్ణరావు,సునీతలు ఆశోక్ నగర్ ప్రాంతంలో నివాసిస్తున్నారు.కృష్ణరావు కరెంట్ ఆఫీసు సెంటర్ వద్ద శ్రీరామా క్యాంటిన్,నడుపుతున్నాడు..ఆదివారం ఉదయం ఇంటికి పాలు పోసే మహిళ వచ్చి చూసే సరికి రక్తపు మడుగులో వున్న కృష్ణరావు మృతుదేహాం కన్పించింది.అమె వెంటనే కృష్ణరావు తమ్ముడు అయిన సుధాకర్ రావుకు తెలియచేసింది.సుధాకర్ రావు,,వైజాగ్ లో వుంటునన్న కృష్ణరావు పెద్ద కొడుకు సాయిచంద్ కు తెలియచేశారు.. సాయిచంద్,, నెల్లూరులో వుంటున్న తమ్ముడు అయిన గోపిచంద్ కు ఫోన్ తెలిపారు.గోపిచంద్,,తండ్రి ఇంటికి చేరుకుని,,తన వద్ద వున్న మరో తాళం ద్వారా ఇంటి తలుపులు తెరచి చూడాగా తల్లి కూడా బెడ్ పై మరణించ వుండడం కన్పించింది..ఇంటిలో వున్న బంగారం అలాగే వున్నట్లు డీస్పీ తెలిపారు.పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించమని,,5th town CI నరసింహరావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నరని,తర్వలో దుండగలును పట్టుకుంటామన్నారు.