ట్విట్టర్ CEO పరాగ్ అగర్వాల్ తొలగించిన ఎలన్ మస్క్

కొనుగోలు వ్యవహారం పూర్తి..
అమరావతి: ఎదుటి వ్యక్తులతో మాట్లడితే,తనకు ఎంత లాభం అని ఆలోచించే టెస్లా కార్ల సీఈవో ఎలన్ మస్క్, ట్విట్టర్ కొనుగోలు వ్యవహారం పూర్తిచేశాడని అమెరికన్ మీడియా వెల్లడించింది. 44 బిలియన్ డాలర్లతో ఎలన్ మస్క్ ఈ డీల్ పూర్తి చేశాడని పేర్కొంది. ట్విట్టర్ తన సొంతం కాగానే, ఎలన్ మస్క్, ట్విట్టర్ సంస్థలో కీలకంగా ఉన్న కొందరు ఉన్నతస్థాయి ఉద్యోగుల్ని తొలగించాడు.వీరిలో CEO పరాగ్ అగర్వాల్‌తో పాటు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్, లీగల్ పాలసీ హెడ్ విజయ గద్దెతోపాటు మరికొందరిని ఉద్యోగంలోంచి తొలగించాడు. వీరిలో కొందరిపై ఎలన్ మస్క్ గతంలో పలు ఆరోపణలు చేశారు. ఫేక్ అకౌంట్లు, కంపెనీకి సంబంధించిన ఇతర అంశాల్లో తనకు తప్పుడు సమాచారం అందించారని మస్క్ ఆరోపించాడు. మరికొందరు ఉద్యోగుల్ని కూడా తొలగించే యోచనలో ఎలన్ మస్క్ వున్నట్లు సంకేతాలు ఇస్తున్నాడు. కంపెనీలో దాదాపు 7,500 మంది ఉద్యోగుల్ని తగ్గించి, కంపెనీలో పలు మార్పులు చేయబోతున్నట్లు సమాచారం.ట్విట్టర్ తన సొంతమైన సందర్భంగా ఎలన్ మస్క్ తన ట్విట్టర్ అకౌంట్‌లో చీఫ్ ట్విట్టర్ అని రాసుకున్నాడు. తాను డబ్బు సంపాదన కోసం ఈ సంస్థను కొనుక్కోలేదని, మానవత్వాన్ని పెంచేందుకే ట్విట్టర్ కొనుగోలు చేశానని పేర్కొన్నాడు?