అమరావతి: జార్ఖండ్ రాష్ట్రంలో చట్టవిరుద్ధమైన మైనింగ్ కేసులో మనీల్యాండరింగ్ నిబంధనలను ఉల్లఘించరన్న సమాచారంతో జార్ఖండ్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ( ED) బుధవారం సోదాలు నిర్వహించింది..ఈ సోదాల్లో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు అత్యంత సన్నిహిత నేత ప్రేమ్ ప్రకాశ్ ఇంట్లో రెండు AK 47 రైఫిల్స్‌ను అద్దెకు తీసుకున్న ఓ ఇంట్లోని అల్మారలో వీటిని దాచారని అధికారులు తెలిపారు.ప్రేమ్ ప్రకాశ్‌కు సంబంధించి తమకు సమాచారం అందిందని,, సీఎం హేమంత్ సోరెన్‌తో సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఈ దాడులు చేపట్టామని అధికారులు పేర్కొన్నారు.ప్రేమ్ ప్రకాశ్ ఇంటి ఆవరణతోపాటు మరో 16 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించామని అధికారులు చెప్పారు.ఆయుధాల గుర్తింపు విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయనున్నామని ఆయుధ చట్టాల ప్రేమ్ ప్రకాశ్‌పై ప్రత్యేక కేసు నమోదు చేసే అవకాశం ఉందని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. అక్రమ మైనింగ్ కేసులో ఈడీ ముమ్మరంగా విచారణ జరుపుతోంది. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తో పాటు పలువురిని ఈడీ అధికారులు ప్రశ్నించారు.