అమరావతి: బెంగళూరులో ఆవుటర్ రింగ్ సమీపంలోని HBR Lay Out ప్రాంతంలో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది..నిర్మాణంలో వున్న 40 అడుగులు ఎత్తు,,టన్నుల కొద్ది బరువు,,ఇనుప రాడ్డుల మెట్రోపిల్లర్,,అదే సమయంలో అటుగా బైక్ పై వెళ్లుతున్న లోహిత్ కుమార్ కుటుంబంపై కూలిపోయింది..సంఘటన జరిగిన సమయంలో బైక్ పైన లోహిత్ కుమార్(34),,అతని భార్య తేజశ్విని(28), 3 సంవత్సరాలు వయస్సు వున్న వారి కవల పిల్లలు ఉన్నారు..స్థానికులు వెంటనే వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించించారు..ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తల్లి, మూడేళ్ల కుమారుడు మృతి చెందగా,తండ్రి,, కుమార్తెలకు అత్యవసర చికిత్స అందిస్తునట్లు పోలీసులు తెలిపారు..ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 6 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది. స్థానికులు, మెట్రో సిబ్బంది సహాయంతో కూలిపోయిన పిల్లర్‌ను, ఇనుప రాడ్లను క్లియర్ చేశారు.