NATIONAL

టర్కీలో రెండు భారీ భూకంపాలు-1800 మంది మృతి-తక్షణ సహాయక బృందాలు-ప్రధాని మోదీ

అమరావతి: టర్కీలో సోమవారం వేకువజామున భారీ భూకంపం సంభవించింది..రిక్టర్ స్కేల్ పై దిని తీవ్రత 7.6,,7.8గా రెండు సార్లు నమోదైంది..భూకంపం ధాటికి దాదాపు 1600 మందికిపైగా మరణించి వుంటారని అధికారులు భావిస్తుండగా,,ఇంకా వేలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నారు..వారిని రక్షించే ప్రయత్నాలు జరుగుతుండగానే మరోసారి భూమి కంపించింది..దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు..దక్షిణ టర్కీలోని కహ్రామన్మరాస్ ప్రావిన్స్‌ లోని ఎల్బిస్తాన్ జిల్లాలో 7.6 తీవ్రతతో మరోసారి భూకంపం వచ్చినట్లు అధికారులు తెలిపారు.. డమాస్కస్, లటాకియా ఇతర సిరియన్ ప్రావిన్సుల్లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం అపారమైన ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చింది..భారీ భూకంపాలతో తీవ్రంగా నష్టపోయిన టర్కీకి తక్షణమే సహాయం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రధాన మంత్రి మోదీ అదేశించారు..దీనిపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది..ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ మిశ్రా, టర్కీకి తక్షణ సహాయ చర్యలపై అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు..కేబినెట్ సెక్రటరీ, హోం శాఖ, NDMA, NDRF, రక్షణ, విదేశాంగ శాఖ, పౌర విమానయాన, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.. NDRF, భారత వైద్య బృందాలు అత్యవసర సహాయక చర్యల కోసం రిపబ్లిక్ ఆఫ్ టర్కీ వెళ్లనున్నారు..అలాగే సహాయక సామాగ్రి, మందులు పంపనున్నారు..ఇక ప్రత్యేక శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్‌లు, 100 మంది NDRF సిబ్బంది సైతం టర్కీ సహాయక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు..భారత వైద్య బృందాలు అవసరమైన మందులతో టర్కీ వెళ్లనున్నాయి..టర్కీ ప్రభుత్వంతో పాటు అంకారాలోని భారత ఎంబసీతో పాటు ఇస్తాంబుల్‌లోని కాన్సులేట్ జనరల్ కార్యాలయంతో భారత బృందాలు సమన్వయం చేసుకుంటాయి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *