AMARAVATHINATIONAL

 తీరం దాటనున్న రెమాల్ తుఫాన్-ప్రధాని మోదీ అత్యవసర సమావేశం

గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంగా గాలులు..

అమరావతి: ఆదివారం రాత్రికి రెమాల్ తుఫాను మరింత తీవ్రం మారి బంగ్లాదేశ్,, పశ్చిమబెంగాల్ తీర ప్రాంతాలను తాకనున్న నేపధ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అత్యవసర సమావేశం నిర్వహించారు..తుపాను తీవ్రతను ఎదుర్కొంనేదుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లపై విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్, నేవీ అధికారులలో సమావేశంలో సమీక్ష జరిపారు.. ప్రాణనష్టం జరగ కుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.. రెమాల్’ తీరానికి చేరుకోగానే గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తాయని,, వీటి వేగం గంటకు 135 కిలోమీటర్ల వరకూ ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది..పశ్చిమబెంగాల్‌లో కోస్తా జిల్లాలో అత్యంత భారీగానూ,, కోల్‌కతా పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది..ముందస్తు ఏర్పాట్లలో భాగంగా పశ్చిమబెంగాల్‌లోని హస్నాబాద్ గ్రామంలో NDFR Teamను మోహరించారు..కోల్‌కతా విమానాశ్రయం నుంచి 394 విమాన సర్వీసులను 21 గంటల పాటు సస్పెండ్ చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *