సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఉదయ్ ఉమేశ్ లలిత్ ఎంపిక

అమరావతి: సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఉదయ్ ఉమేశ్ లలిత్ నామినేట్ అయ్యారు.. ప్రస్తుత సీజేఐ ఎన్వీ రమణ పదవీకాలం అగష్టు 26తో పూర్తవనున్న నేపథ్యంలో తదుపరి ప్రధాన న్యాయమూర్తిని సిఫార్సు చేయాల్సిందిగా కేంద్రం ఆయన్ను కోరింది..సుప్రీంకోర్టు సీనియారిటీ లిస్టులో జస్టిస్ రమణ తరువాత న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ ఉన్నారు.. దీంతో ఆయన పేరును ఎన్వీ రమణ సిఫార్సు చేశారు..ఈ నెల 26వ తేదీన ఎన్వీ రమణ సీజేఐగా పదవీ విరమణ చేయనున్నారు..జస్టిస్ లలిత్ భారత 49వ సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన పదవీకాలం నవంబర్ 8వ తేది వరకే అంటే సీజేఐగా రెండున్నర నెలలే పదవిలో కొనసాగుతారు..