అమరావతి: టీడీపీ అధ్యక్షడు చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవ వర్గంలో 3 రోజుల పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది…బుధవారం రోడ్లపై అనుమతి లేకుండా రోడ్‌షోలు, సభల నిర్వహణకు వీలు లేదంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన జీ.ఓ నెం1,, నేపథ్యంలో చంద్రబాబు రోడ్ షో నిర్వహణకు అనుమతి లేదంటూ డిఎస్పీ చంద్రబాబుకు నోటీసులు అందజేశారు..నోటీసులు తీసుకునేందుకు చంద్రబాబు నిరాకరించారు..తన సొంత నియోజకవర్గానికి ఎందుకు వెళ్లనివ్వరు…రోడ్ షోకి పర్మిషన్ ఎందుకు ఇవ్వరు…ఇంతమంది ప్రజలను ఇబ్బంది పెడతారా అంటూ డీఎస్పీ సుధాకర్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు.. జీ.ఓ నెం 1 ప్రకారం రహదారులపై సభలు, రోడ్‌షోలపై ఆంక్షలు ఉన్నాయని, నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు..ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు.. పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్న పార్టీ శ్రేణులు, మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రతిపక్షాల సభలు ప్రభుత్వ దయ,,దాక్షిణ్యాలతో జరిగేలా ప్రభుత్వం జీ.ఓ తెచ్చిందన్నారు…ముఖ్యమంత్రి జగన్ మాత్రం రాజమహేంద్రవరంలో రోడ్‌షో, సభ నిర్వహించారని విమర్శించారు.. అధికారపార్టీలకు, ప్రతిపక్షాలకు నిబంధనల్లో తేడాలెందుకని ప్రశ్నించారు..తన పర్యటనపై నెల రోజుల ముందే డీజీపీకి లేఖ రాశానని తెలిపారు..తన వాహానంను పోలీసులు స్వాధీనం చేసుకున్నరని,,తన వాహానం ఇచ్చే వరకు పెద్దూరులో ఇంటి ఇంటికి తిరుగుతాను అని చెప్పారు…