నీరవ్ మోదీని భారత్ కు అప్పగించేందుకు యుకే కోర్టు లైన్ క్లియర్

అమరావతి: ఎట్టకేలకు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్ కు తీసుకుని వచ్చేందుకు దాదాపు లైన్ క్లియర్ అయింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను రూ.11 వేల కోట్ల మేర మోసగించి,బ్రిటన్ లో తలదాచుకుంటున్న నీరవ్ మోదీని భారత్‌కు అప్పగింత ఆదేశాలను సవాలు చేస్తూ గతంలో అతడు దాఖలు చేసిన పిటిషన్‌ను యూకే న్యాయస్థానం బుధవారం తోసిపుచ్చింది. దీంతో ఎట్టకేలకు భారత దర్యాప్తు ఏజెన్సీల కృషి ఫలించినట్టయ్యింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసం కేసులో వేల కోట్ల రూపాయల మోసం, మనీ ల్యాండరింగ్ కేసుల్లో నీరవ్ మోదీ నిందితుడిగా ఉన్నాడు. నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించాలంటూ గత ఫిబ్రవరిలో వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్ట్ డిస్ట్రిక్ట్ జడ్జి సామ్ గూజెస్ గత ఫిబ్రవరిలో తీర్పునిచ్చారు.ఈ తీర్పుని సవాలు చేస్తూ లండన్ కోర్టులో నీరవ్ మోదీ పిటిషన్ దాఖలు చేశాడు. ఫిబ్రవరిలో ఈ కేసుని పరిశీలించిన లార్డ్ జస్టిస్ జెరెమీ స్టువర్ట్-స్మిత్, జస్టిస్ రాబర్ట్ జయ్ బుధవారం తాజా తీర్పునిచ్చారు.