DISTRICTS

కుష్టు వ్యాధి నివారణ,అవగాహన కార్యక్రమాలు చేపట్టండి-కలెక్టర్

నెల్లూరు: జిల్లాలో కుష్టు వ్యాధి నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు.సోమవారం నగరంలోని కలెక్టరేట్ S.R శంకరన్ వి.సీ.హాల్లో మహాత్మాగాంధీ వర్ధంతి-అమరవీరుల దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కుష్టు వ్యాధి వ్యతిరేక దినాన్నినిర్వహించారు..ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కుష్టు వ్యాధి, క్షయ వ్యాధి నివారణకు ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలన్నారు..జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పెద్ద ఎత్తున పారిశుద్ధ్య కార్యక్రమాలు, కుష్టు,క్షయ వ్యాదులపై అవగాహన కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టడంతో పాటు విరివిగా వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు..అలాగే అన్ని విద్యాసంస్థల్లో కూడా కుష్టు, క్షయ వ్యాధుల నివారణపై అవగాహన కార్యక్రమాలు విరివిగా చేపట్టాలని తద్వారా విద్యార్థుల కుటుంబ సభ్యులు ఆరోగ్యంపై దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉందన్నారు..గ్రామాల్లో విరివిగా గ్రామసభలు సర్పంచ్లు ఆధ్వర్యంలో నిర్వహించి వ్యాధుల నివారణ పై ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు..అనంతరం జిల్లా కలెక్టర్ కుష్టు వ్యాధి నివారణపై అవగాహన కలిగించే కరపత్రాలను ఆవిష్కరించారు..ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ పెంచలయ్య, జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి డాక్టర్ వెంకట ప్రసాద్, జెడ్పీ సీఈవో చిరంజీవి, డిఆర్డిఏ పిడి సాంబశివారెడ్డి, ఐసిడిఎస్ పిడి శ్రీమతి సౌజన్య తదితర అధికారులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *