అమరావతి: దేశంలో ఉగ్రవాద చర్యలను ప్రొత్సహిస్తున్న పీఎఫ్ఐ దాని అనుబంధ సంస్థలపై 5 సంవత్సరాల పాటు నిషేధం విధిస్తూ కేంద్ర హోంశాఖ బుధవారం ఉత్తర్వులు విడుదల చేసింది.( Unlawful Activities (Prevention) Act) UAPA చట్టం కింద కేంద్రం చర్యలు తీసుకుంది. ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక ప్రభుత్వాల నుంచి వచ్చిన విజ్ఞాపన మేరకే PFI సంస్థపై నిషేధం విధించినట్లు సమాచారం.ఈ రాష్ట్రల్లో మూడు సార్లు జరిగిన దాడుల్లో, కీలక ఆధారాలు లభ్యం అయ్యాయని, వాటి ఆధారంగా,PFIను నిషేధించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేశామని అధికార వర్గాలు పేర్కొన్నాయి. సంస్థపై నిషేధం ఉండటంతో,PFIకి సంబంధించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోడానికి మార్గం సుగమం అయ్యిందని దర్యాప్తు సంస్థ వర్గాలు వెల్లడించాయి.