స్వల్ప అస్వస్థతకు గురైన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

అమరావతి: కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం స్వల్ప అస్వస్థతకు లోనైయ్యారు. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలోని శివ మందిర్ నుంచి సేవక్ కంటోన్మెంట్ వరకు 4 లైన్ల రహదారికి శంకుస్థాపన చేయడానికి వెళ్లారు. డార్జిలింగ్ జంక్షన్ సమీపంలోని దగాపూర్ మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని పాల్గొన్న సందర్బంలో వేదికపైనే కేంద్ర మంత్రి అస్వస్థతకు గురికావడంతో వెంటనే కార్యక్రమాన్ని నిలిపివేశారు.గడ్కరీ స్టేజ్‌పై ఉండగానే షుగర్ లెవెల్ పడిపోవడంతో అకస్మాత్తుగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. వెంటనే ఆసుపత్రి నుంచి వైద్యుల బృందం ఘటనాస్థలికి చేరుకుని కేంద్ర మంత్రికి ప్రథమ చికిత్స అందించారు. గడ్కరీని వేదిక నుంచి డార్జిలింగ్ ఎం.పీ రాజు బిష్త్ నివాసానికి వెళ్లి విశ్రాంతి తీసుకెళ్లారు. కేంద్రమంత్రికి అయన నివాసంలో చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు.గడ్కరీ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని మోదీ, బెంగల్ సీఎం మమత ఆరా తీశారు.