AMARAVATHINATIONAL

బుద్ది మార్చుకోని ప‌శ్చిమ దేశాలు-ఎన్నికల నిర్వహణపై మనకు పాఠలా-జయశంకర్

అమరావతి: భార‌త్‌లో జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌పై ఇటీవ‌ల అమెరికా,, కెన‌డా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంక‌ర్ ఘాటుగా స్పందించారు..ప‌శ్చిమ దేశాల త‌మ పాత‌ అల‌వాట్ల‌ను మానుకోవ‌డం లేద‌న్నారు.. ప్ర‌పంచాన్ని 200 సంవత్సరాల పాటు శాసించిన‌ట్లు ప‌శ్చిమ దేశాలు ఫీల‌వుతుంటాయ‌ని,,ప్రస్తుతం భారతదేశం వాళ్ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న విష‌యాన్ని ఆ దేశాలు జీర్ణించుకోలేక‌పోతున్నాయని ఆయ‌న వ్యాఖ్యనించారు..కోల్‌క‌తాలో మంగళవారం జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ పై విదంగా వ్యాఖ్య‌నించారు..

ఖ‌లిస్తానీ ఉగ్ర‌వాది హ‌ర్‌దీప్ సింగ్ నిజ్జార్ హ‌త్య కేసులో భార‌త ప్రభుత్వంపై కెన‌డా ప్ర‌ధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేసిన విష‌యం మనకు విదితమే..అయితే ట్రూడో చేసిన వ్యాఖ్య‌ల‌ను ఇండియా ఖండించింది..సిక్కు వేర్పాటువాది గురుప‌త్వంత్ సింగ్ ప‌న్నున్‌ను హ‌త్య చేసేందుకు ఇండియా ప్లాన్ వేసిన‌ట్లు అమెరికా కూడా ఆరోపించింది..ఈ ఆరోప‌ణ‌ల‌పై నిగ్గుతేల్చేందుకు భారతదేశం ఓ ఎంక్వైరీ ప్యాన‌ల్‌ను ఏర్పాటు చేసింది..ఈ ఆరోప‌ణ‌లపై కూడా విదేశంగా మంత్రి జయశంక‌ర్ సమాధానం ఇస్తూ ప్ర‌పంచాన్ని శాసించాల‌న్న పాత బుద్దిని ప‌శ్చిమ దేశాలు వ‌దులుకోలేక‌పోతున్నట్లు ఆరోపించారు..

మ‌న దేశంపై పెత్త‌నం చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఆ దేశాలు ఉన్నాయ‌ని అక్కడి మీడియా వైఖరి,, ఎందుకంటే గ‌డిచిన 80 సంవత్సరాలుగా నుంచి ప్ర‌పంచ దేశాల‌పై ఈ దేశాలు వలస పాలన విధానం అవలంభించాయన్నారు..గ‌డిచిన 200  నుంచి ప్ర‌పంచాన్ని శాసించామ‌న్న ఆలోచ‌న‌లో ఉన్న ప్రశ్చిమ దేశాలు,,త‌మ పాత ప‌ద్ధ‌తిని ఎలా మార్చుకుంటాయ‌ని విదేశాంగ మంత్రి జయశంక‌ర్ ప్రశ్నించారు..ఎన్నిక‌ల ఫ‌లితాల కోసం కోర్టుల‌ను ఆశ్ర‌యించే దేశాలు ఇప్పుడు మ‌న‌కు ఎన్నిక‌లు ఎలా నిర్వ‌హించాల‌న్న అంశంలో పాఠాలు చెబుతున్నాయ‌ని మండిపడ్డారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *