తైవాన్ లో అడుగుపెట్టిన అమెరికా హౌజ్ స్పీకర్ నాన్సీ పెలోసి

అమరావతి: చైనా హెచ్చరికలు బేఖాతర చేస్తు,,అమెరికా హౌజ్ (ప్రతినిధుల సభ) స్పీకర్ నాన్సీ పెలోసి మంగళవారం రాత్రి మలేసియా నుంచి విమానంలో తైవాన్ రాజధాని తైపీలొ అడుగు పెట్టారు..తైపీలోని గ్రాండ్ హయత్ హోటల్ వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు మధ్య ఆమె అక్కడే బస చేస్తున్నారు..పెలోసీ తైవాన్ పర్యటన నేపథ్యంలో అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి..తైవాన్ లో పెలోసీ పర్యటన ప్రారంభంకాగానే చైనా అధికారిక వార్తా సంస్థ స్పందిస్తు,, తైవాన్ పరిసర సముద్ర జలాల్లో చైనా సైన్యం ఆదివారం వరకు లైవ్ ఫైర్ డ్రిల్స్ చేపట్టనున్నట్లు ప్రకటించింది.. చైనా సైన్యం 21 విమానాలను తైవాన్ గగనతలంలోకి పంపించింది..ఇదే సమయంలో పెలోసీ తైవాన్ పర్యటనను అమెరికా ప్రభుత్వం కాని ప్రతిపక్షపార్టీలు కాని ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు..దీంతో తైవాన్ విషయంలో తమ వైఖరిలో మార్పు లేదని అమెరికా అధ్యక్షుడు స్పష్టం చేసినట్లు అయింది..ఈ పరిణామం అమెరికా-చైనా మధ్య మరింత దూరం పెంచే ఆవకాశం కన్పిస్తుంది..పెలోసీ పర్యటనపై స్పందించేందుకు తైవాన్ విదేశాంగ శాఖ నిరాకరించింది..ఆమె పర్యటనపై తైవాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయలేదు..25ఏళ్ల తరువాత తైవాన్ ను సందర్శిస్తున్న అత్యున్నత అమెరికా ప్రతినిధి నాన్సీ పెలోసీ కావడం గమనించ తగ్గ ఆంశం..తైవాన్ లో అడుగు పెట్టిన తరువాత ఆమె పెలోసీ ఒక ప్రకటన విడుదల చేశారు.తైవాన్ లో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని అమెరికా ఆకాంక్షిస్తోందని, అందుకు తగిన సహాయంను కొనసాగించడాన్ని గౌరవంగా భావిస్తున్నామని పేర్కొన్నారు..