x
Close
AMARAVATHI HYDERABAD

తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ ట్రైన్ ఒక గొప్ప కానుక-ప్రధాని నరేంద్రమోదీ

తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ ట్రైన్ ఒక గొప్ప కానుక-ప్రధాని నరేంద్రమోదీ
  • PublishedJanuary 15, 2023

అమరావతి: సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య సెమీ హైస్పీడ్ వందేభారత్ ఎక్స్‌ ప్రెస్ పట్టాలెక్కింది. సంక్రాంతి కానుకగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం ట్రైన్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు..జనవరి 16 నుంచి ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది..ఈ సందర్బంలో ప్రధాని మాట్లాడుతూ ఆగి ఆగి నడిచే రైళ్ల నుంచి వేగంగా పరుగులు తీసే రైళ్ళను తీసుకువచ్చామని,, వందే భారత్ ట్రైన్. ఆత్మ నిర్భర్ భారత్‌కు ప్రతీక అన్నారు.. ఈ ట్రైన్ భారత్‌లోనే డిజైన్ చేసి, తయారుచేసిన ఎక్స్‌ ప్రెస్ అని తెలిపారు..పండగ వాతావరణంలో తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ ట్రైన్ ఒక గొప్ప కానుక..తెలుగు ప్రజలకు వందేభారత్ ఎక్స్ ప్రెస్ ఎంతో ప్రయోజనకరంగా వుంటుందన్నారు..హైదరాబాద్,, వరంగల్,,విజడవాడ,,విశాఖ నగరాలను అనుసంధానిస్తూ ప్రయాణం సాగుతుందని వెల్లడించారు..వందే భారత్ ఎక్స్‌ ప్రెస్‌తో సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ప్రయాణ సమయం తగ్గుతుందని ప్రధాని మోదీ అన్నారు.. గడిచిన ఎనిమిది సంవత్సరాల్లో రైల్వే వ్యవస్థను సౌకర్యవంతమైన ప్రయాణంగా మార్చామని,,ఇప్పుడు రైళ్లు ఆధునిక భారత్‌కు అద్దం పడుతున్నాయన్నారు.. విస్టాడోమ్ రైలు, కిసాన్ రైలు, హెరిటేజ్ రైలు నడుపుతున్నామన్నారు..

సికింద్రాబాద్ లోని 10వ నెంబర్ ప్లాట ఫాం నుంచి ప్రారంభమైయ్యే వందేభారత్ ట్రైన్ లో 16 కోచ్ లు వుంటాయి..ఇందులో 14 ఛైర్ కార్ బోగీలు,,మరో 2 ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్ లు వుంటాయి..మొత్తంగా రైలుల్లో 1128 మంది ప్రయాణించ వచ్చు..అదివారం తప్ప మిగిలిన అన్ని రోజుల్లో ఈ ట్రైన్ సికింద్రాబాద్-విశాఖపట్నంలా మధ్య పరుగులు తీస్తుంది..ఈ రైలులో మెట్రోరైలు తరహాలో స్ల్తెండింగ్ డోర్స్,,ప్రయాణికులు భద్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు..CCTV కెమెరాలు,,రీడింగ్ లైట్లు,,అత్యవసర పరిస్థితిలో రైలు సిబ్బందితో మాట్లాడేందుకు ప్రత్యేకంగ అలారం బటన్ ఏర్పాటు చేశారు..విశాఖ నుంచి ప్రతి రోజు ఉదయం 5.45కి వందేభారత్ ట్రైన్ ప్రారంభంమై,,మధ్యాహ్నం 2.15 నిమిషాలకు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది..సికింద్రాబాద్ లో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి రాత్రి 11.30 గంటలకు విశాఖపట్నంకు చేరుకుంటుంది..వందేభారత్ గంటలకు 180 కీ.మీ వేగంతో ప్రయాణిస్తుందని,, సికింద్రాబాద్-విజయవాడల మధ్య దూరం 350 కీ.మీటర్లను 4 గంటల్లో చేరుకుంటుంది..అలాగే సికింద్రాబాద్-విశాఖపట్నం ప్రయాణ సమయం 8.30 గంటలు పడుతుంది..

టిక్కెట్ ధర:-వందేభారత్ ట్రైన్ టిక్కెట్ ధరను రైల్వేశాఖాధికారులు అధికారికంగ ప్రకటించారు..చైర్ కార్ లో సికింద్రాబాద్ నుంచి వరంగల్ కు రూ.529…ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కు రూ.1005లు..చైర్ కార్ లో సికింద్రాబాద్ నుంచి ఖమ్మం వరకు రూ.750లు…సికింద్రాబాద్ నుంచి విజయవాడలకు రూ.905లు…సికింద్రాబాద్ నుంచి రాజమండ్రికి రూ.1365లు.. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు రూ.1665లుగా వుంటుందన్నారు..అలాగే విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ కు రూ.1720లు ధర వుంటుందన్నారు..ఒక వేళ ఎవరైన ఆహారం వద్దు అనుకుంటే,,సదరు మొత్తంను తిరిగి ఇచ్చి వేస్తామని తెలిపారు…

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.