వెంకయ్య సభను నడిపించిన శైలి, కొత్త వారికి ఆదర్శంగా ఉంటుంది-ప్రధాని మోదీ

అమరావతి: రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు పదవీ కాలం ఈనెల 10న ముగియనుంది..పార్లమెంట్లో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు..రాజ్యసభ సభ్యులు వెంకయ్య నాయుడికి ఘనంగా వీడ్కోలు పలికారు..రాజ్యసభలో వెంకయ్య నాయుడి వీడ్కోలు ప్రసంగాల్లో చప్పట్ల హోరేత్తింది..వెంకయ్య నాయుడు తీసుకున్న నిర్ణయాలను గుర్తు చేసుకుంటూ అభినందనలతో ముంచెత్తారు.. వెంకయ్య నాయుడు సమక్షంలో సభలో అనేక చారిత్రక ఘటనలు జరిగాయని గుర్తు చేసుకున్నారు..సభలో వెంకయ్య నిర్ణయాలు, అనుభవం సభ్యులందరికీ ప్రేరణగా నిలుస్తాయని ప్రధాని మోడీ కొనియాడారు..సభను నడిపించే శైలి.. కొత్త వారికి ఆదర్శంగా ఉంటుందన్నారు.. వెంకయ్యనాయుడు చూపిన మార్గాన్ని భవిష్యత్తులో రాజ్యసభ అనుసరిస్తుందని అన్నారు..వెంకయ్య నాయుడుతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని ప్రధాని మోడీ వెల్లడించారు.