ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు విజయ దీపికలు-అరుణమ్మ

నెల్లూరు: ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసి, జిల్లాను ప్రగతి పథంలో నడిపించాలని జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ సభనుద్దేశించి కోరారు..శుక్రవారం జడ్పీ సమావేశ మందిరంలో అరుణమ్మ అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ పాలకమండలి సమావేశం ప్రారంభం కాగా జడ్పీ సీఈవో చిరంజీవి సభను కొనసాగించారు..ఈ సందర్బంలో అమె మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు సులభంగా పాఠాలు అర్థమయ్యేలా ముద్రించిన విజయ దీపికలను అందజేయనున్నట్లు చెప్పారు..అనంతరం శాఖల వారీగా సమీక్షించారు. ముందుగా వైద్యారోగ్యశాఖ, విద్యా శాఖ, ఇరిగేషన్, పంచాయతీ రాజ్, డ్వామా, వ్యవసాయ శాఖల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను ఆయా శాఖల అధికారులు సభకు వివరించారు..ఈ సందర్భంగా వ్యవసాయశాఖ మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడుతూ జడ్పిటిసి సభ్యులు సూచించిన ప్రతి సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, అధికారులకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని చెప్పారు..ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు,,ఎమ్మెల్యే,,జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు..అనంతరం విజయ దీపిక పుస్తకాలను ప్రజా ప్రతినిధులు, అధికారుల సమక్షంలో మంత్రి, జడ్పీ చైర్ పర్సన్ ఆవిష్కరించారు.