AMARAVATHIDISTRICTS

ఎన్నికల ప్రవర్తననియమావళి ఉల్లంఘన జరగకుండా చూడాలి-కలెక్టర్

నెల్లూరు: జిల్లాలోఎన్నికల తర్వాత రాజకీయ ఘర్షణలు, అల్లర్లు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లాకలెక్టర్ ఎం.హరినారాయణన్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు.మంగళవారం అధికారులతో ఎన్నికల ప్రవర్తన నియమావళి,కౌంటింగ్ ప్రక్రియపైజిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్  రిటర్నింగ్ అధికారులు రాబోయే 13 రోజులు అప్రమత్తంగా ఉండి ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని అన్నారు.

జిల్లాలో క్షేత్రస్థాయిలో రాజకీయ ఘర్షణలు జరగకుండా కిందిస్థాయి సిబ్బందితో సమాచారం తెప్పించుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. రాజకీయ ఘర్షణలపై ఎన్నికల సంఘం సీరియస్ గా ఉందన్నారు. మండల స్థాయిలో తహసిల్దార్లు పోలీసు అధికారులు సంయుక్తంగా వెళ్లి గ్రామాల్లో పర్యటించాలన్నారు. జిల్లాలో ఎన్నికలపై ఫిర్యాదులు  వస్తున్నాయని ప్రతి ఫిర్యాదును పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.జిల్లాలో ఉన్న ఎన్నికల స్ట్రాంగ్ రూములను వద్దకు రిటర్నింగ్ అధికారులు ప్రతిరోజు సందర్శించాలన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *