బ్రహ్మోత్సవాల సమయంలో విఐపిలను కట్టడి చేయాలి-భానుప్రకాష్ రెడ్డి

తిరుమల: గత బ్రహ్మోత్సవాలను దృష్టిలో పెట్టుకొని తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ ఏర్పాట్లను చెయ్యాలని టీటీడీ మాజీ పాలక మండలి సభ్యుడు బిజెపి నేత భానుప్రకాష్ రెడ్డి కోరారు..సోమవారం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు..అనంతరం ఆలయ వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెండేళ్ల తరువాత భక్తుల సమక్షంలో జరిగే బ్రహ్మోత్సవాలను ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహించాలని టిటిటి అధికారులను ఆయన కోరారు..