నెల్లూరు: భవిష్యత్ లో క్రీడలకు మరింత ప్రోత్సాహం అందిస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి అన్నారు.శనివారం సాయంత్రం ముత్తుకూరు మండల కేంద్రంలో ERRM క్లబ్ లో జరిగిన KGR వాలీబాల్ క్లబ్ టోర్నమెంట్ 2022 విజేతకు బహుమతి ప్రధానోత్సవంలో మంత్రి పాల్గొన్నారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ సాధారణ మండల కేంద్రం లో జరిగినప్పటికి, జాతీయ స్థాయిలో జరిగినట్టు ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించిన నిర్వాహకులకు, విజేత లైన చెన్నై డేంజర్ బాయ్స్ జట్టుకు అభినందనలన్నారు. గెలుపోటములకు అతీతంగా క్రీడాకారులు మరింతగా క్రీడల్లో రాణించాలని, వారికి మంచి భవిష్యత్ ఉండాలని ఆశిస్తున్నామన్నారు. జిల్లాకే తలమానికంగా గ్రౌండ్ ను తీర్చిదిద్దిన స్థానిక పోలీస్ S.I శివకృష్ణారెడ్డి, స్థానిక నాయకులు మెట్ట.విష్ణువర్ధన్ రెడ్డిల కృషి మరువలేనిదన్నారు.ఈ సందర్బంగా అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారులు అజయ్ కుమార్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ వాలీబాల్ కోచ్ మోహన్ రావులను మంత్రి ఘనంగా సన్మానించారు.