సర్దార్ వల్లభాయ్ పటేల్ మిలటరీ యాక్షన్-అమిత్ షా

హైదరాబాద్: ఓటు బ్యాంకు రాజకీయాల వల్లే ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపలేదని కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యనించారు.. శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ నిర్వహిస్తోన్న తెలంగాణ విమోచన దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరై మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలన్నదే ప్రజల ఆకాంక్ష అన్నారు..తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతోనే వేడుకలు జరపాలని,, కొందరు ఇతర పేర్లతో జరుపుతున్నారని ఆయన విమర్శించారు. నిజాంకు వ్యతిరేకంగా ఎందరో పోరాటం చేశారని,,అలాగే హైదరాబాద్ స్వాతంత్ర్యం కోసం ఎందరో పోరాడారని,, చివరికి సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్లే తెలంగాణకు విముక్తి లభించిందని పేర్కొన్నారు.. పటేల్ లేకపోతే అఖండ భారత్ లక్ష్యం నెరవేరేది కాదన్నారు..75 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వమూ విమోచన దినోత్సవం నిర్వహించలేకపొవడం బాధకరమన్నారు..భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా (తెలంగాణ రాష్ట్రం) నిజాం రాజ్యంలో ఇక్కడ అరాచకాలు కొనసాగాయని చెప్పారు.. సర్దార్ వల్లభాయ్ పటేల్ మిలటరీ యాక్షన్ తీసుకొవడంతోనే ఈ ప్రాంతానికి విముక్తి లభించిందని గుర్తు చేశారు..పటేల్ పోరాటంతో నిజాం తలవంచారని అన్నారు.