AMARAVATHIPOLITICS

రాష్ట్ర భవిష్యత్ నిర్ణయాధికారాన్ని అప్పగించేందుకు ఓటర్లు సిద్దం..

96 లోక్‌సభ స్థానాలు..
అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్‌, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ దశలో ఆంధ్రప్రదేశ్ 25 పార్లమెంట్,,175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనున్నది..దేశ వ్యాప్తంగా తీసుకుంటే మొత్తం 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది..ఆంధ్రప్రదేశ్‌ (25), తెలంగాణ (17), బిహార్ (5), జార్ఖండ్ (4), మధ్యప్రదేశ్ (8), మహారాష్ట్ర (11), ఒడిశా (4), యూపీ (13), పశ్చిమ బెంగాల్ (8), జమ్మూ కశ్మీర్‌లో శ్రీనగర్ ఒక సీటుకు పోలింగ్ జరగనుంది..
దేశవ్యాప్తంగా 7 దశల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటి వరకు మూడు దశల్లో, మొత్తం 285 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది..సోమవారం 4వ దశ పోలింగ్ జరుగుతుంది..మిగిలిన మూడు దశలు మే 20, మే 25, జూన్ 1వ తేదీన జరగనున్నాయి.. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానున్నది..అదే రోజున దేశంలోని ఓటరు ఏ పార్టీకి పాలన పగ్గాలు అందిస్తారు అనేది స్పష్టం కానున్నది..అలాగే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సైతం అదే రోజు లెక్కించనున్నారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *