NATIONAL

G-20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం బాధ్యతగా భావిస్తున్నాం-జైశంకర్

అమరావతి: ప్రపంచ దేశాల్లో బలమైన కూటమిగా పేరుపొందిన  G-20 అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టింది.ఇటీవల ఇండోనేషియాలో జరిగిన G-20 సమావేశాల్లో ఈ బాధ్యతలను భారత్ కు బదిలీ చేశారు. డిసెంబరు 1వ తేది నుంచి G-20 అధ్యక్ష బాధ్యతలను భారత్ నిర్వర్తిస్తుందని ప్రకటించారు. ప్రపంచ దేశాల్లో అనేక రాజకీయ సవాళ్లు ఉన్న సమయలో భారత్ G-20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం బాధ్యతగా భావిస్తున్నామని భారత విదేశాంగ శాఖమంత్రి జైశంకర్ అన్నారు.గురువారం ఢిల్లీలో జరిగిన G-20 యూనివర్సిటీ కనెక్ట్..ఎంగేజింగ్ యంగ్ మైండ్స్ ఈవెంట్ లో కన్పరేన్స్ లో అయన మాట్లాడారు. తీవ్రవాదం, నల్లధనం కట్టడిపై భారత్ ప్రణాళిక బద్దంగా వ్యవహరిస్తొందని, ప్రపంచ ఆర్థిక, అభివృద్ధి సవాళ్లను పరిష్కరించడానికి G-20 ఉపయోగపడుతుందన్నారు.సంవత్సరం పాటు భారత్ G-20 అధ్యక్ష పదవిలో కొనసాగుతుంది. సంవత్సరం వ్యవధిలో దేశవ్యాప్తంగా 32 ప్రాంతాల్లో పలు అంశాలపై 200  సమావేశాలను నిర్వహించనున్నారు.అధ్యక్ష బాధ్యతల నేపథ్యంలో G-20 లోగోను త్రివర్ణ పతాకం స్ఫూర్తిగా రూపొందించారు. దేశంలోని 100 స్మారక చిహ్నాలపై ఈ లోగోను ప్రదర్శించనున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *