CRIMEHYDERABAD

నగరంలో డ్రగ్స్ వినియోగిస్తున్న 30 మందిని గుర్తించాం-కమీషనర్ ఆనంద్

అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్స్ ఆరెస్ట్..

హైదరాబాద్: డార్క్ వెబ్ సైట్ లో డ్రగ్స్ కొనుగొలు చేసి క్రిప్టో కరెన్సీ పేమెంట్స్ చేస్తు,,లొకల్ గా డ్రగ్స్ సరఫరా చేస్తున్నఇద్దరు అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్స్ తో పాటు హైదరాబాద్ కు చెందిన ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.గురువారం అయన మీడియాతో మాట్లాడుతూ ఈ ముఠాలో ఇద్దరు సభ్యులను అరెస్టు చేశామని,,మరొకరు పరారీలో ఉన్నారని తెలిపారు..నగరంలో డ్రగ్స్ వినియోగిస్తున్న 30 మందిని గుర్తించామని వీరిలో రాజకీయ, వ్యాపార, సినిమా రంగాలకు చెందినవారు ఉన్నారని వెల్లడించారు..డ్రగ్స్ వినియోగదారులపై కూడా కేసులు పెడుతున్నామని,, డ్రగ్స్ వినియోగిస్తున్న వారంతా ఉన్నత చదువులు చదివి, సంపన్నులుగా ఉన్నవారే అన్నారు..వారి నుంచి 140 గ్రాముల చరస్, 1450 గ్రామ్స్ గాంజా, 184 బ్లాట్స్ LSD, 10 గ్రామ్స్ MDMA స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ దాదాపు రూ.9 లక్షలు వుండవచ్చన్నారు.. డార్క్ వెబ్ ద్వారా ఆర్డర్స్ చేసుకుంటూ,,క్రిప్టో కరెన్సీ ద్వారా పేమెంట్స్ చేస్తున్నారని,,ఈ నెట్ వర్క్ కి లీడర్ నరేంద్ర ఆర్య అనే వ్యక్తి అని, ఇతను గోవాలో ఉంటూ నెట్ వర్క్ నడిపిస్తున్నాడని చెప్పారు..ఇతనికి దేశవ్యాప్తంగా 4 వేల మంది వినియోగదారులున్నారు..ఆర్డర్ పేమెంట్ చేసిన తర్వాత కొరియర్ ద్వారా డ్రగ్స్ ని పంపిస్తున్నారని,,కొరియర్ ఏజెన్సీలు కూడా స్కానర్స్ పెట్టుకొని కొరియర్స్ లో ఎలాంటి వస్తువులు వస్తున్నాయో పరిక్షించాలని సీపీ సూచించారు.పెడ్లర్స్ మామూలు పార్శీలాగా డ్రగ్స్ ని కొరియర్స్ లో పంపుతున్నారని,,నెల రోజుల్లో 600 మంది డ్రగ్ యూజర్స్ ని గుర్తించామని తెలిపారు..ఎక్కువగా స్టూడెంట్స్, ఐటీ ఉద్యోగులే ఉన్నారు సీపీ ఆనంద్ వెల్లడించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *