రామోజీ ఫీల్మ్ సిటీని ముట్టడిస్తాం-సీపీఎం

హైదరాబాద్: ప్రభుత్వం పేదలకు కేటాయించి,స్థలాల పట్టాలు పంపిణీ చేయగా,సదరు భూమిని రామోజీరావు కబ్జా చేశారని సీపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జాన్ వెస్లీ ఆరోపించారు.బుధవారం సంబంధిత సర్వేనెంబరులో వున్న భూములను పేదలకు చూపించాలంటూ,చలో రామోజీఫీల్మ్ సిటీ కార్యక్రమంలో నిర్వహించారు.ఈ సందర్బలో అయన మాట్లాడుతూ పేదలకు సదరు భూములు చూపించాలని,లేదంటే ఫీల్మ్ సిటీని ముట్టడిస్తమన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నాగాన్ పల్లి రెవెన్యూ గ్రామంలో 2007వ సంవత్సరంలో 18 ఏకరాల్లో 700 మంది పేదలకు, ఒక్కొక్కరికి 60 గజాల వంతున అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఇళ్ల పట్టాలు అందచేశారన్నారు.పట్టాలు అందుకున్న పేదలకు అప్పటల్లో ఇళ్లు నిర్మించుకోవడంలో ఆశ్రద్ద వహించారు.తరువాత జరిగిన పరిణామాల్లో ఈ భూములు రామోజీ ఫిల్మ్ సిటీకి ఇవ్వాలని సంబంధిత వర్గాలు ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారని తెలిపారు.వాళ్లు అడిగిందే తడవుగా 2017లో ఇందులో 295 ఏకరాలను కేటాయించేందుకు ప్రభుత్వం శద్ద చూపించిందని ఆరోపించారు. ప్రస్తుతం 189, 203 సర్వే నంబరుల్లో వున్న భూమికి రామోజీ రావు గేట్లు పెట్టి పేదలను లోపలకు రానివ్వడం లేదన్నారు.పేదలకు కేటాయించిన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం సహకరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రాయాపోల్, నాగన్ పల్లి, పొల్కంపల్లి గ్రామాల ప్రజలు, సీపీఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.