తిరుపతి: రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తున్నప్పుడు,రాష్ట్రాని కాపాడుకునేందుకు ప్రత్యర్ధ్యపార్టీలతో సైతం కలసి ముందుకు నడపవడమే రాజకీయమంటూ పొత్తుల ప్రస్తావించి, పరోక్షంగా అధికారపార్టీని జనసేనాని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఆదివారం తిరుపతిలో జనవాణి- జనసేన భరోసా కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ రాష్ట్రంలో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన పార్టీ ప్రజరంజకంగా పాలిస్తే,ప్రతిపక్షపార్టీలకు మాట్లాడే అవకాశం వుండదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.తనను అధికారపార్టీ నాయకులు,ప్రతి సారి దత్తపుత్రుడు అంటూ హేళన చేస్తున్నరని,తాను దత్తపుత్రుడు అయితే అవెంజర్స్ సినిమాలో విలన్ పేరు “తానోస్” అని,,నవరత్నాల పేరుతో అర్ధిక విధ్వసం చేస్తున్న అధికారపార్టీ అధినేతను ఆంధ్ర “తానోస్” పేరుతో పిలుచుకుందామంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యనించారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై ప్రత్యక్ష్యంగా తెలుసుకునేందుకు జనసేన-జనవాణి కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు..జనవాణి కార్యక్రమంలో రహాదారులు,మౌలిక సదుపాయాలు,విద్య,వైద్యం,శేషచలం అడవుల్లో ఎర్రచందనం దొపిడి,దేవలయాల నిధులను దారి మళ్లీంచడం లాంటి సమస్యలను బాధిత ప్రజలు తన దృష్టికి తీసుకుని వచ్చారని చెప్పారు.రాయలసీమలో దళితులను అణిచివేస్తున్నరని,వారీ బాధలను బయటకు చెప్పుకునే పరిస్థితి కన్పించడంలేదన్నారు.రాయలసీమ నుంచి ఇంత మంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పాలించినప్పటికి,ఈ ప్రాంతంలో యువతకు ఉపాధి ఎందుకు కల్పించలేకపోతురంటూ నిలదీశారు.వెనకపడిన కులాలకి రాజకీయ సాధికారత లేనంత కాలం రాయలసీమా వెనుకుబాటుతనం ఇలాగే వుంటుందన్నారు..యువతలో మార్పు రాకుంటే,వారికి ఉపాధి అవకాశలు సాధ్యంకావన్నారు.గత ప్రభుత్వం పంచాయితీలకు నిధులు అందకుండా చేసిందని,తమ ప్రభుత్వం రాగానే పంచాయితీలకు నిధులు సమకూరుస్తామని ఎన్నికల్లో వాగ్దనం చేసిన వైసీపీ ప్రభుత్వం, అధికారంలోకి రాగానే దాదాపు 7 వేల కోట్లక పైగా నిధులను దారి మళ్లీంచిందని మండిపడ్డారు.