DEVOTIONALDISTRICTS

అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం-ఈవో ధర్మారెడ్డి

భక్తులందరికీ వాహన సేవల దర్శనానికి ఏర్పాట్లు..

తిరుమల: కోవిడ్ వల్ల రెండేళ్ళుగా నాలుగు మాడ వీధుల్లో శ్రీవారి శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించలేక పోయామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు నాలుగు మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామన్నారు. నాలుగు మాడ వీధుల్లో ఉండే ప్రతిభక్తుడికి సంతృప్తి కరంగా వాహన సేవల దర్శనం కల్పించడానికి ఏర్పాట్లు చేస్తామని ఆయన చెప్పారు..తిరుమల అన్నయ్య భవనంలో శనివారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా ఈవో టీటీడీ చేపట్టిన పలు కార్యక్రమాల గురించి భక్తులకు వివరించారు.

సెప్టెంబరు 27 నుండి అక్టోబరు 5వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబరు 20న ఉదయం 6 నుంచి 11 గంటల మధ్య సంప్రదాయబద్ధంగా ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తాం.– సెప్టెంబర్‌ 26న రాత్రి 7 నుండి 8 గంటల మధ్య అంకురార్పణ జరుగుతుంది.-. సెప్టెంబరు 27న మొదటి రోజు సాయంత్రం 5.45 నుండి 6.15 గంటల వరకు మీన లగ్నంలో ధ్వజారోహణం, రాత్రి 9 నుండి 11 గంటల వరకు పెద్ద శేష వాహనం నిర్వహిస్తాం.-. ధ్వజారోహణం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.-. ప్రతిరోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు స్వామివారి వాహన సేవలు జరుగుతాయి. అయితే గరుడ వాహనం రాత్రి 7 నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు నిర్వహిస్తాం.– అక్టోబర్‌ 5న తొమ్మిదో రోజు ఉదయం 6 గంటలకు చక్రస్నానం, అదేవిధంగా రాత్రి 9 నుండి 10 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహిస్తాం.-. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ సర్వదర్శనం మాత్రమే అమలు చేయాలని టీటీడీ నిర్ణయించింది.-. భక్తుల రద్దీని దృష్ట్యా విఐపి బ్రేక్‌ దర్శనాలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్‌ఆర్‌ఐలు, రక్షణ సిబ్బందికి ప్రత్యేక దర్శనం తదితర ప్రివిలేజ్డ్‌ దర్శనాలను రద్దు చేశాం.-. ఆర్జిత సేవలు, రూ.300/- దర్శన టికెట్లతోపాటు శ్రీవాణి ట్రస్టు దాతలకు, ఇతర ట్రస్టుల దాతలకు దర్శన టికెట్లు రద్దు చేశాం.-. గదులకు సంబంధించి 50 శాతం ఆన్‌లైన్‌లో భక్తులు బుక్‌ చేసుకునేందుకు వీలుగా అందుబాటులో. ఉంచాము.-. తిరుమలలో గదుల లభ్యత పరిమితంగా ఉన్న కారణంగా భక్తులు తిరుపతిలోనే గదులు పొంది బస చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.-. సాధారణ రోజుల్లో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం 9 నుండి రాత్రి 11 గంటల వరకు అన్నప్రసాదవితరణ ఉంటుంది.-. బ్రహ్మోత్సవాల రోజుల్లో ఉదయం 8 నుండి రాత్రి 11.30 గంటల వరకు అన్నప్రసాద వితరణ చేస్తాం.-. గరుడసేవనాడు రాత్రి 1 గంట వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుంది.-. వాహనసేవల ముందు ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుండి అపురూపమైన కళారూపాల ప్రదర్శనలు ఏర్పాటు చేస్తాం.-. ఆగస్టు 16 నుండి 20వ తేదీ వరకు నెల్లూరులో వైభవోత్సవాలు నిర్వహించాం.-. అక్టోబరు 11 నుండి 15వ తేదీ వరకు హైదరాబాద్‌లోని ఎన్‌టిఆర్‌ స్టేడియంలో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహిస్తాం. భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి సేవలను తిలకించి ఆశీస్సులు పొందాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *