కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తాం-ముఖ్యమంత్రి

అమరావతి: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కాంట్రాక్టు రిక్రూట్‌మెంట్ విధానాన్ని శాశ్వతంగా రద్దు చేస్తూన్నట్లు శనివారం ప్రకటించారు. కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని, ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని సీ.ఎం పుట్టిన రోజు సందర్బంగా సమావేశం అయన కేబినెట్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈసందర్బంలో అయన మాట్లాడుతూ “కాంట్రాక్ట్ రిక్రూట్‌మెంట్ విధానాన్ని శాశ్వతంగా రద్దు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిందని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. నేటికీ చాలా రాష్ట్రాల్లో కాంట్రాక్టు రిక్రూట్‌మెంట్ విధానాన్ని కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. ఒడిశాలో కాంట్రాక్టు రిక్రూట్‌మెంట్ శకం నేటితో ముగిసిందని,ఈ నిర్ణయం వారి కుటుంబ సభ్యుల కోసం దీపావళిని ముందుగానే తీసుకొచ్చింది” ముఖ్యమంత్రి తెలిపారు. ఒడిశా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఒడిశాలో 57,000 మందికిపైగా ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు.ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అమలుకు ఆదనంగా ప్రభుత్వానికి సంవత్సరానికి దాదాపు రూ.1,300 కోట్లు ఖర్చు కానున్నది.
Odisha Government abolishes contractual recruitment in the state. "All contractual employees will be regularised," announces Chief Minister Naveen Patnaik.
(File photo) pic.twitter.com/YOeGsQerOw
— ANI (@ANI) October 15, 2022