AMARAVATHINATIONAL

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం పశ్చిమ బెంగాల్లోని హూగ్లీలో ఆయన బీజేపీ ప్రచార సభలో పాల్గొని మాట్లాడుతూ పాక్ ఆక్రమిత కశ్మీర్ మనదని,, దాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెప్పారు..పాక్ ఆక్రమిత కశ్మీర్ మనది కదా? అంటూ సభలో పాల్గొన్న ప్రజలను ఉధ్దేశించి ప్రశ్నించారు..మణిశంకర్ అయ్యర్, ఫరూఖ్ అబ్దుల్లా మాత్రం పాకిస్థాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయని అంటు భారతదేశంను భయపెట్టాలని చూస్తూన్నన్నారని అన్నారు..పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించి మేం మాట్లాడకూడదని చెప్పి మమల్ని భయపెట్టాలని చూస్తున్నరంటూ మండిపడ్డారు..

ఇలాంటి వాటికి బీజెపీ ఎన్నటికి భయపడదని,,రాహుల్ బాబా, మమతా దీదీ ఎంత భయపడినా ఫర్వాలేదని వ్యగ్యంగా వ్యాఖ్యనించారు..పీవోకే మనదని, ఆ ప్రాంతాన్ని మళ్లీ తీసుకుంటామని స్పష్టం చేశారు.. జమ్మూకశ్మీర్‌లో ఇంతకు ముందు కొందరు నిరసనలు తెలిపేవారన్నారు.. ప్రధాని మోదీ, ఆర్టికల్ 370 తొలగించిన తరువత ఇప్పుడు అక్కడ హర్తాళ్లు,,రాళ్లూ రువ్వడం వంటివి జరగడం లేదని చెప్పారు..అయితే ఇదే సమయంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ లో మాత్రం ఇటువంటివి జరుగుతున్నాయని తెలిపారు..ఇంతకు ముందు జమ్మూకశ్మీర్ లో స్వతంత్రం కావాలంటూ నినాదాలు వినపడేవని, ఇప్పుడు పీవోకేలో వినపడుతున్నాయని చెప్పారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *