నెల్లూరు: నెల్లూరు నగరంలోని OWEL14 అనే కార్పొరేట్ స్కూల్ లో దారుణం చోటు చేసుకుంది.4వ తరగతి చదువుతున్న 9 సంవత్సరా బాలికపై,PROగా పనిచేస్తున్న బ్రహ్మయ్య అనే వ్యక్తి లైగింక వేధింపులకు పాల్పపడ్డాడు.చాలా రోజుల నుంచి సదరు బాలిక ఇంట్లో మౌనంగా వుండడంతో,అనుమానం వచ్చిన అమె తల్లి తరచి తరచి ప్రశ్నించడంతో,స్కూల్ జరిగిన సంఘటన గురించి చెప్పిందని,బాలిక తల్లి మీడియా తెలిపింది. విషయం తెలుసుకున్న బాలిక బంధువులు,తీవ్రంగా పరిగణించి స్కూల్ యాజమన్యంను నిలదీయడంతో,పోలీసులు రంగప్రవేశం చేశారు. బయటకు తెలియడంతో,బాలికను ప్రభుత్వం ఆసుపత్రికి పరిక్షల నిమిత్తం తీసుకుని వెళ్లారు.టీడీపీ రూరల్ నియోజకవర్గం ఇన్ చార్జ్ అజీజ్ సోమవారం,ఆసుపత్రిలో వున్న బాలికను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లడారు.