INTERNATIONALTECHNOLOGY

సర్వర్ డౌన్ కావడంతో అగిపోయిన వాట్సాప్ సేవలు-2 గంటల తరువాత పునురద్ధరణ

అమరావతి: భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మంగళవారం సర్వర్ డౌన్ కావడంతో వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి. దీంతో  యూజర్లు మెసేజ్ లు చేయలేకపోయారు. మధ్యాహ్నం 12.07 గంటల నుంచి సమస్య తలెత్తింది. పర్సనల్ మెసేజ్ లకు సింగిల్ టిక్ మాత్రమే వస్తుండగా, స్టేటస్ లు కూడా అప్ డేట్ కాలేదు. దీంతో ఏం జరుగుతుందో తెలియక యూజర్లు ఆయోమయానికి గురి అయ్యారు. అరగంట గడిచినా ప్రాబ్లెం కంటిన్యూ అయింది. భారత్తో పాటు ఇటలీ, టర్కీలోనూ వాట్సప్ సేవలు నిలిచిపోయినట్లు సమాచారం.

మధ్యాహ్నం 12. 07 గంటల నుంచి నిలిచిపోయిన వాట్సప్ సేవలు,,తిరిగి  2.15 గంటల నుంచి పునురద్ధరించబడ్డాయి. అందరికి మెసేజ్ లు వెళుతున్నట్లు యూజర్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. యూజర్లు మెసేజ్ లు పంపలేకపోతున్నట్లు తమ దృష్టికి రావడంతో సమస్యను పరిష్కరించినట్లు మెటా కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు..సర్వర్ డౌన్ అవడమే కారణమని, టెక్నికల్ టీమ్ వాట్సప్ ను త్వరగా రీస్టోర్ చేశారని  వెల్లడించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *