AMARAVATHI

తెలంగాణలో బీజెపీ అధికారంలోకొస్తే,బీసీ వ్యక్తే ముఖ్యమంత్రి-అమిత్ షా

హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ అధికారంలోకొస్తే కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.. శనివారం నల్లగొండ జిల్లాలో నిర్వహించిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో పాల్గొన్న సభలో అయన మాట్లాడుతూ కేసీఆర్ రెండుసార్లు ప్రజలను మోసం చేశాడని,, మూడోసారి మళ్లీ మోసం చేయడానికి వస్తున్నాడని,,విలువైన ఓటుతో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చాలని పిలుపునిచ్చారు..

తెలంగాణ ప్రజలు బీజేపీని గెలిపిస్తే బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి చేస్తానని ప్రధాని మోదీ ప్రకటించిన విషయంను అయన గుర్తు చేశారు.. జాతీయ బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించిన ఘనత మోదీకే దక్కిందన్నారు.. బీసీ పిల్లలకు 25% ఎంబీసీ రిజర్వేషన్ కల్పించామని తెలిపారు..బీజేపీ అధికారంలోకి వస్తే కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగ విరుద్ధమైన, మతపరమైన 4 శాతం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్నారు..కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుటుంబ పార్టీలని,, ఒక ప్రక్కకేసీఆర్ తన కొడుకు కేటీఆర్ ను సీఎం చేయాలని మరో వైపు సోనియాగాంధీ తన కొడుకు రాహుల్ ని ప్రధాని కోసం పనిచేస్తున్నారని విమర్శించారు..బీజీపీ అధికారంలోకి వస్తే కుటుంబ, వారసత్వ రాజకీయాలు ఉండబోవన్నారు..కాంగ్రెస్ పార్టీ రామ మందిర నిర్మాణాన్ని అడుగడుగునా అడ్డుకుందని,,కాంగ్రెస్ పార్టీ కల్పించిన అన్ని అడ్డంకులను దాటుకుని అయోధ్య రామ మందిరం పూర్తి చేసిన ఘనత ప్రధాని మోదీకే దక్కిందని చెప్పారు..జనవరి 22న రామ జన్మభూమిలో రామ మందిర నిర్మాణం పున:ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు.

Spread the love
venkat seelam

Recent Posts

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

8 hours ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

10 hours ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

14 hours ago

బుద్ది మార్చుకోని ప‌శ్చిమ దేశాలు-ఎన్నికల నిర్వహణపై మనకు పాఠలా-జయశంకర్

అమరావతి: భార‌త్‌లో జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌పై ఇటీవ‌ల అమెరికా,, కెన‌డా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై విదేశాంగ మంత్రి…

14 hours ago

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

18 hours ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

1 day ago

This website uses cookies.