నెల్లూరు: వారసత్వంగా వస్తున్న పొలంపై ఆధాపడి జీవిస్తున్న తమను,పొలం అమ్మలంటూ కొంతమంది వ్యక్తులు భౌతిక దాడులకు దిగడంతో పాటు మమ్మల్ని చంపేస్తామంటు బెదిరిస్తున్నరని,నాయకులు,అధికారులు జోక్యం చేసుకుని రక్షణ కల్పించాలంటూ నెల్లూరుజిల్లా మర్రిపాడు మండలం కృష్ణపురంకు చెందిన షేక్.అబ్దులా వేడుకున్నాడు.గురువారం సీమాంధ్ర బీసి సంఘం నాయకులతో కలసి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు.